ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా చమురు కొన్నారో జాగ్రత్త... భారత్‌కు అమెరికా హెచ్చరిక...

ABN, First Publish Date - 2022-03-16T18:35:11+05:30

డిస్కౌంట్ ధరకు చమురు ఇస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : డిస్కౌంట్ ధరకు చమురు ఇస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్‌ను భారత దేశం స్వీకరించే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై అమెరికా ఘాటుగా స్పందించింది. అదే జరిగితే భారత దేశం దండయాత్రకు మద్దతిచ్చినట్లవుతుందని, చరిత్రలో ఆ దేశానికి  అపఖ్యాతి తప్పదని హెచ్చరించింది.  


అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్నాయని చెప్పారు. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను భారత దేశం కొనడం ఆ ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని తాను భావించడం లేదన్నారు. అయితే భారత్ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ దేశాన్ని చరిత్రలో అపఖ్యాతిపాలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాసే చరిత్ర పుస్తకాల్లో ఏ వైపు ఉండాలనుకుంటున్నదీ భారత దేశం నిర్ణయించుకోవాలన్నారు. రష్యా నాయకత్వానికి మద్దతివ్వడమంటే దండయాత్రకు మద్దతివ్వడమేనన్నారు. దీనివల్ల విధ్వంసకర ప్రభావం ఉంటుందని చెప్పారు. తాము విధించిన, సిఫారసు చేసిన ఆంక్షలను పాటించాలని ప్రతి దేశాన్నీ కోరుతున్నామని తెలిపారు. 


Updated Date - 2022-03-16T18:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising