ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారం అడ్డాలోనే పుట్టా, దానిపై ఆశ లేదు: రాహుల్

ABN, First Publish Date - 2022-04-10T00:01:50+05:30

అధికారం అడ్డాలోనే (సెంటర్ ఆఫ్ పవర్) తాను పుట్టానని, దానిపై ఆశ కానీ ఆకర్షణ కానీ తనకు లేవని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అధికారం అడ్డాలోనే (సెంటర్ ఆఫ్ పవర్) తాను పుట్టానని, దానిపై ఆశ కానీ ఆకర్షణ కానీ తనకు లేవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జవహర్ భవన్‌లో శనివారంనాడు జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అధికారం కోసమే రాజకీయ నాయకులు నిరంతరం వెంపర్లాడుతుంటారని, తాను అధికారం అడ్డాలోనే పుట్టానని, నిజాయితీగా చెప్పాలంటే వాటిపై తనకెలాంటి ఆసక్తి లేదని చెప్పారు. దీనికి బదులు దేశ ప్రజల మనోగతాలను అవగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని చెప్పారు. ఆ ప్రక్రియలో ప్రపంచంలోనే అంటరానితనం ఉనికి ఇప్పటికీ ఉన్న ఏకైక దేశం ఇండియా అనే విషయం తాను గ్రహించానని అన్నారు. ఈ తరహా  దృక్పథం మార్చుకుని, అంటరానితనానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తననెంతగానో ప్రేమిస్తున్న దేశ ప్రజలకు తాను రుణపడి ఉంటానని అన్నారు.

Updated Date - 2022-04-10T00:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising