ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత దేశ సంప్రదాయ వైద్యం గురించి తెలుసు : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ABN, First Publish Date - 2022-04-20T00:04:28+05:30

భారత దేశంలో సంప్రదాయ వైద్యం ఉన్నట్లు తనకు తెలుసునని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జామ్ నగర్ (గుజరాత్) : భారత దేశంలో సంప్రదాయ వైద్యం ఉన్నట్లు తనకు తెలుసునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ చెప్పారు. జామ్ నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు. ఈ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 


ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వం మార్చి 25న ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంగళవారం ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఘెబ్రెయెసుస్ మాట్లాడుతూ, భారత దేశంలోని సంప్రదాయ వైద్యం గురించి తాను తెలుసుకున్నానని తెలిపారు. తాను తన గురువులకు కృతజ్ఞుడినని చెప్పారు. తాను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు. బాలీవుడ్ ఫ్యాన్స్‌కు స్విస్ అల్ప్స్ చాలా ఇష్టమైన ప్రదేశమని చెప్పారు. సాక్ష్యాధారాలుగల సంప్రదాయ వైద్యాన్ని బలోపేతం చేయడానికి సైన్స్ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాత్కాలిక కార్యాలయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 250 మిలియన్ డాలర్లను సమకూర్చినందుకు, పదేళ్ళపాటు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చినందుకు  మోదీకి ధన్యవాదాలు చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, టెడ్రోస్ హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో మాట్లాడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఈ విధంగా మూడు భాషల్లో మాట్లాడటం తమ హృదయాలకు హత్తుకుందని చెప్పారు. 


Updated Date - 2022-04-20T00:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising