ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir : అధికరణ 370 పునరుద్ధరణపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-09-11T22:33:03+05:30

తప్పుడు వాగ్దానాలు తన రాజకీయ ఎజెండాలో ఉండవని జమ్మూ-కశ్మీరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : తప్పుడు వాగ్దానాలు తన రాజకీయ ఎజెండాలో ఉండవని జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) చెప్పారు. జమ్మూ-కశ్మీరుకు  ప్రత్యేక హోదాను కల్పించే విధంగా  అధికరణ 370ని భారత రాజ్యాంగంలో మళ్లీ ప్రవేశపెడతామనే హామీని తాను ఇవ్వబోనని చెప్పారు. తప్పుడు వాగ్దానాలివ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుందని తాను విశ్వసించనని చెప్పారు. 


ఉత్తర కశ్మీరులోని బారాముల్లా పట్టణంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడుతూ, అధికరణ 370ని పునరుద్ధరించాలంటే లోక్‌సభలో కనీసం 350 ఓట్లు, రాజ్యసభలో కనీసం 175 ఓట్లు అవసరమని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు ఏ రాజకీయ పార్టీకి లేవని, భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని తెలిపారు. 50 కన్నా తక్కువ స్థానాలకు కాంగ్రెస్ క్షీణించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికరణ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మాట్లాడితే, ఆ పార్టీ తప్పుడు వాగ్దానం చేస్తున్నట్లేనని చెప్పారు. 


తన రాజకీయ ఎజెండాలోని అంశాలను వివరిస్తూ, జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, స్థానికులకు భూములు, ఉద్యోగ కల్పనకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇవి సాధించదగిన లక్ష్యాలని తెలిపారు. అధికరణ 370ని రద్దు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రతిపాదించిన తీర్మానాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. ఈ తీర్మానానికి అనుకూలంగా తాను ఓటు వేసినట్లు కొందరు తనను నిందిస్తున్నారన్నారు. ఈ అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ తాను ఓటు వేశానని చెప్పారు. పార్లమెంటు (Parliament) పని తీరు గురించి తెలియనివారు తాను ఈ అధికరణకు వ్యతిరేకంగా ఓటు వేశానని ఆరోపిస్తున్నారని వివరించారు. 


తాను జమ్మూ-కశ్మీరు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన 13 మంది పోలీసులను అరెస్టు చేయించానని తెలిపారు. వారు 15 ఏళ్ళ నుంచి జైలులోనే ఉన్నారని చెప్పారు. అప్పట్లో తాను ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేశానని చెప్పారు. వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేయించానని తెలిపారు. ఎన్నికల్లో తనకు నాలుగు ఓట్లు వచ్చినా, లక్షలాది ఓట్లు వచ్చినా తాను ప్రజలను మోసం చేయబోనని చెప్పారు. 


గులాం నబీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. 


Updated Date - 2022-09-11T22:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising