ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : చేతులు జోడించే తత్వం కాదు, నాది పోరాట పంథా : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-09-10T16:39:31+05:30

కాంగ్రెస్ (Congress) పార్టీని వీడిపోతున్న నేతల గురించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కాంగ్రెస్ (Congress) పార్టీని వీడిపోతున్న నేతల గురించి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతులు జోడించి, బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవడం కొందరికి చాలా సులువని, తన స్వభావం అలాంటిది కాదని, తనది పోరాట పంథా అని చెప్పారు. భారత దేశ భావనకోసం తాను పోరాడతానని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలను తన స్వాధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించారు. ఇక పోరాటం భారత దేశ రాజ్య నిర్మాణం, ప్రతిపక్షాల మధ్యేనని చెప్పారు. ఇటీవల గులాం నబీ ఆజాద్ వంటి నేతలు పార్టీని వీడుతుండటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, వారిపై ఒత్తిడి పెంచగలిగే శక్తిసామర్థ్యాలు కచ్చితంగా తన కన్నా  బీజేపీకి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 


భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు బస చేసేందుకు దాదాపు 60 కంటెయినర్లను ఉపయోగిస్తున్నారు. 


ఇదిలావుండగా, గులాం నబీ ఆజాద్, జైవీర్ షేర్గిల్ ఇటీవల కాంగ్రెస్ నుంచి వైదొలగి, ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-09-10T16:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising