ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ సీఎంకి నేనే ఫోన్ చేశా: ప్రియాంక గాంధీ

ABN, First Publish Date - 2022-01-10T22:04:08+05:30

ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందనే విషయం తనకు ఆందోళన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందనే విషయం తనకు ఆందోళన కలిగించడంతో వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఫోన్ చేసి ఆ వివరాలు కనుకున్నానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ-వాద్రా తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనలో సెక్యూరిటీ లోపంపై ప్రియాంక గాంధీకి వివరించినట్టు పంజాబ్ సీఎం ఇటీవల ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది ప్రియాంక ఏమైనా రాజ్యాంగ పదవిలో ఉన్నారా? అని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివరణ ఇచ్చారు. ప్రధాని దేశానికే ప్రధాని అని, అందుకే తాను స్వయంగా సీఎంకు ఫోన్ చేసి సమాచారం కనుక్కొన్నానని చెప్పారు.


''నేనేమీ రాజ్యాంగ పదవిలో లేను. టీవీలో వార్త చూసినప్పుడు ప్రధాని భద్రతపై ఆందోళన చెందాను. ప్రధాని క్షేమ సమాచారంతో పాటు పంజాబ్ ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేసిందా అనే విషయం తెలుసుకోవాలనుకున్నాను. ఒక కొలీగ్‌గానే చన్నీకి ఫోను చేసి ఆయనతో మాట్లాడాను'' అని ప్రియాంక గాంధీ తెలిపారు. మోదీ దేశానికే ప్రధాని అని ఆమె పేర్కొన్నారు. ఈనెల 5న పంజాబ్ పర్యటన సమయంలో భద్రతా లోపం తలెత్తడంతో ఒక ఫ్లైఓవర్‌పై ప్రధాని 20 నిమిషాల పాటు ఉండిపోయారు. అనంతరం ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు.

Updated Date - 2022-01-10T22:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising