ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

beefపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-24T13:26:18+05:30

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య గోమాంసం(beef)పై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య గోమాంసం(beef)పై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాను హిందువునని, ఇప్పటివరకు గోమాంసం తినలేదని, కావాలంటే తాను బీఫ్ తింటానని చెప్పి బీఫ్ బ్యాన్ అంశంపై వివాదానికి తెర లేపారు.తుమకూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభకు హాజరైన సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని మాజీ సీఎం ఆరోపించారు.“నేను హిందువుని. నేను ఇప్పటివరకు గొడ్డు మాంసం తినలేదు, కానీ నాకు కావాలనుకుంటే, నేను తింటాను. నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?’’అని తుమకూరులో జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్య ప్రశ్నించారు.


‘‘గొడ్డు మాంసం తినేవాళ్లు కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదు, హిందువులు కూడా గొడ్డు మాంసం తింటారు, క్రైస్తవులు కూడా తింటారు. ఒకసారి నేను కర్నాటక అసెంబ్లీలో కూడా చెప్పాను. బీఫ్ తినకూడదని నాకు చెప్పడానికి మీరు ఎవరు?’’ అని సిద్ధరామయ్య అన్నారు.గత ఏడాది కర్నాటక బీఫ్ బ్యాన్ చట్టాన్ని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.ఆర్ఎస్ఎస్ తోటి మనుషుల్లో తేడాలు సృష్టించడం, మతాల మధ్య అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ఆరోపించారు.

Updated Date - 2022-05-24T13:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising