ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లిం మహిళ ఒకనాటికి ప్రధాని కావొచ్చు: ఒవైసీ

ABN, First Publish Date - 2022-02-13T21:46:29+05:30

హిజాబ్ వివాదాన్ని ఎంఐఎం చీఫ్, హైదరాబద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలోకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హిజాబ్ వివాదాన్ని ఎంఐఎం చీఫ్, హైదరాబద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలోకి లాక్కొచ్చారు. ఒకనాటికి హిజాబీ ధరించే మహిళే ప్రధాని కావొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని సంబల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అమ్మాయిలను హిజాబ్ ధరించడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. హిజాబ్ ధరించిన అమ్మాయిలు డాక్టర్లు, డీఎం, ఎస్‌డీఎంలు అవుతారని, ఒకనాటికి దేశానికి ప్రధాని కూడా కావొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు.


ట్రిపుల్ తలాఖ్‌ చట్టంతో ముస్లిం మహిళలకు సాధికారత కల్పించినట్టు ప్రధాని మాట్లాడుతుంటారని, హిజాబ్ వివాదం మాటేమిటని ఒవైసీ నిలదీశారు. ''బేటీ బచావో, బేటీ పడావో'' అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాషాయం ధరించిన వ్యక్తుల మధ్య ఒక ముస్లిం బాలిక నడుస్తూ ''అల్లా హో అక్బర్'' నినాదం చేయడంపై మాట్లాడుతూ, ప్రతి ముస్లింకు ఇలాంటి ధైర్యం కావాలని అన్నారు.

Updated Date - 2022-02-13T21:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising