ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్‌పై కోర్టు ధిక్కారం వద్దు

ABN, First Publish Date - 2022-05-28T18:00:33+05:30

హిజాబ్‌ విషయంలో కోర్టు తీర్పును పాటించాలని, దేశ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలని మాజీ మంత్రి ఈశ్వరప్ప తెలిపారు. శివమొగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - మాజీ మంత్రి ఈశ్వరప్ప


బెంగళూరు: హిజాబ్‌ విషయంలో కోర్టు తీర్పును పాటించాలని, దేశ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలని మాజీ మంత్రి ఈశ్వరప్ప తెలిపారు. శివమొగ్గలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ముస్లిం విద్యార్థులు ఉండాలంటే న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందేనన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇటీవల అన్ని విద్యాసంస్థలలోనూ సజావుగా సాగుతున్నాయన్నారు. అయితే మంగళూరులో మరోసారి హిజాబ్‌ వివాదం తెరపైకి వచ్చిందన్నారు. హంపనకట్టిలోని విశ్వవిద్యాలయంకు అను బంధమైన కళాశాలలో హిజాబ్‌తో తరగతులకు వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. 40మంది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హిజాబ్‌తోనే తరగతులకు రావడం, మాకూ కాషాయం శాలువాలతో వచ్చే అవకాశం ఉండాలని విద్యార్థులు ఆందోళన చేశారన్నారు. ఇటువంటి గందరగోళ వాతావరణం సరికాదన్నారు. హిజాబ్‌కు సంబంధించి ముస్లింనేతలు తమ భావనలను మార్చు కోవాలన్నారు. యువతకు ముస్లింనేతలు మార్గదర్శకులు కావాలని, కానీ దారి తప్పించరాదన్నారు. 

Updated Date - 2022-05-28T18:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising