ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gunmen: హిందూ సంస్థల నేతలకు గన్‌మెన్‌ల కేటాయింపు

ABN, First Publish Date - 2022-08-24T16:05:38+05:30

రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు చేపట్టనున్న వివిధ హిందసూ సంస్థల నేతలకు సాయుధ పోలీసుల భద్రత కల్పించారు. కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు చేపట్టనున్న వివిధ హిందసూ సంస్థల నేతలకు సాయుధ పోలీసుల భద్రత కల్పించారు. కరోనా లాక్‌డౌన్‌(Corona Lockdown)లో రెండేళ్లుగా రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ యేడాది ఈ వేడుకలను గతంలా భారీ యెత్తున ఘనంగా జరిపేందుకు హిందూ మున్నని వంటి హిందూ సంస్థల నాయకులు ఏర్పాట్లుచేపడుతున్నారు. ఈ నేపథ్యం లో రాష్ట్రమంతటా 89 మంది హిందూ సంస్థల నాయకులు, ప్రముఖులకు గన్‌మెన్లతో రక్షణ కల్పించారు. ఈ విషయమై పోలీసు శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ నెలాఖరున రాష్ట్రంలో హిందూ(Hindu) సంస్థల ఆధ్వర్యం లో వినాయకచవితి వేడుకలు భారీ యెత్తున నిర్వహించనున్నారని, ఆ వేడుకల ఏర్పాట్లు చేపడుతున్న హిందూ సంస్థల నాయకులకు ఎలాంటి హాని కలుగకూడదనే ఆలోచనతో ప్రభుత్వం గన్‌మెన్లతో రక్షణ కల్పించిందని తెలిపారు. చెన్నై నగరంలో హిందూ సంస్థల నేతలు ఆర్డీ ప్రభు, విరుగై శివకుమార్‌, ముకుందన్‌, ఫాతిమా, వీఎం శివకుమార్‌కు గన్‌మెన్లను కేటాయించినట్టు ఆయన వివరించారు.

Updated Date - 2022-08-24T16:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising