ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RSS చీఫ్ మోహన్ భగవత్‌తో అసోం సీఎం భేటీ

ABN, First Publish Date - 2022-01-31T15:03:27+05:30

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌తో అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని సిల్చార్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాచర్ (అస్సాం): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌తో అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని సిల్చార్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.మోహన్ భగవత్ జనవరి 27 నుంచి అస్సాంలోని సిల్చార్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు.వీరి మధ్య సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.భగవత్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి స్థానికులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు రాలేదు. అసోంలోని లఖీపూర్ పట్టణంలో 37కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, స్టేడియం నిర్మించనున్నట్లు సీఎం హిమంత శర్మ ప్రకటించారు.



లఖీపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం నిర్మాణానికి రూ.25కోట్లు, స్టేడియం కోసం రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం శర్మ చెప్పారు.అసోం రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కాచర్‌లోని సిబ్‌పూర్-లాఖీపూర్ రహదారిపై చిరి నదిపై షహీద్ నందచంద్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.నది వంతెన వద్ద షాహీద్ నందచంద్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం శర్మ వివరించారు. 

Updated Date - 2022-01-31T15:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising