ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hijab: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-09-20T13:03:14+05:30

హిజాబ్‌పై(Hijab) వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్(Taslima Nasreen) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హిజాబ్‌పై(Hijab) వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్(Taslima Nasreen) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.హిజాబ్ మహిళల ఎంపిక కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇరాన్‌లో జరిగిన నిరసనల నుంచి ధైర్యం పొందుతున్నారని నస్రీన్ వ్యాఖ్యానించారు.హిజాబ్‌పై ఇరాన్ మహిళల(Iranian womens) నిరసనను ఆమె ప్రశంసించారు. హిజాబ్‌ను కాల్చివేసి జట్టు కత్తిరించుకున్న ఇరాన్ మహిళలకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.(Iranian womens protest)‘‘హిజాబ్ అనేది మహిళల అణచివేతకు, అవమానానికి చిహ్నం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా తమ హిజాబ్‌ను కాల్చివేసి, హిజాబ్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి’’ అని తస్లీమా కోరారు.


హిజాబ్ ధరించాలనుకునే మహిళలకు అలా చేసే హక్కు ఉండాలి. కానీ ఇష్టపడని వ్యక్తులు హిజాబ్ ధరించకుండా ఉండే హక్కు ఉండాలని చెప్పారు.‘‘హిజాబ్ నిజానికి ఎంపిక కాదు. చాలామంది మహిళలు హిజాబ్ ధరిస్తారు, ఎందుకంటే వారు హిజాబ్ ధరించవలసి ఉంటుంది. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బలవంతంగా మహిళలు హిజాబ్ ధరించేలా బ్రెయిన్‌వాష్ చేస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు.మత ఛాందసవాదులు స్త్రీలను బురఖా, హిజాబ్ ధరించమని బలవంతం చేస్తారని, హిజాబ్ మతపరమైనది కాదని, ఇది రాజకీయ హిజాబ్ అంటూ తస్లీమా వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-20T13:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising