ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్‌ వివాదం.. పలుచోట్ల పరీక్షల బహిష్కరణ

ABN, First Publish Date - 2022-02-24T17:38:26+05:30

రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు ప్రారంభమైన విచారణ సాయంత్రం దాకా కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి కేసుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు ప్రారంభమైన విచారణ సాయంత్రం దాకా కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి కేసుకు సంబంధించి ఎటువంటి సలహాలైనా మధ్యవర్తులు లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చునన్నారు. తమకు సాయం అవసరం లేదని, కానీ చాలామంది మధ్యవర్తులు ఈ విషయమై ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నందున లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామన్నారు. ఆరు నెలల కాలం వాదనలు వినడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సీనియర్‌ న్యాయవాది పూవయ్య వాదనలో హిజాబ్‌ మతపరమైన విధానమే అయినా తరగతిగదిలో ఏ మతానికి సంబంధించిన వస్త్రధారణకు అనుమతి లేదన్నారు. విద్యార్థులు సమానంగా ఉండాలనే యూనిఫాం విధానం ఉందని, ఇందులో మతానికో విధానం ఉండరాదన్నారు. కాగా హిజాబ్‌ వివాదం రాష్ట్రమంతటా యథావిధిగా కొనసాగింది. విజయపురలో 15 మంది విద్యార్థినులు పీయూ ప్రీ-ఫైనల్‌ పరీక్షలు బహిష్కరించారు. హిజాబ్‌ లేకుండా పరీక్షలు రాసేది లేదని వారు తేల్చిచెప్పారు. విజయనగర జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల ప్రాంగణాలలో నిషేధాజ్ఞలు అమలు చేసేలా జిల్లా అధికారి శ్రవణ్‌ ఆదేశించారు. అయితే పలుచోట్ల విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-24T17:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising