ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP: Current Bill ఎక్కువ వచ్చిందని Tower ఎక్కిన వ్యక్తి

ABN, First Publish Date - 2022-07-18T20:42:49+05:30

ఉత్తరప్రదేశ్ ఓ పేదవాడికి విద్యుత్ బిల్లు షాక్ గట్టిగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి హైటెన్షన్ వైర్ ఎక్కి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh): ఓ పేదవాడికి విద్యుత్ బిల్లు (Current Bill) షాక్ గట్టిగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి 40కే వోల్టు హైటెన్షన్ వైర్ (High tension wire) పైకి ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ ఏర్పడింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నందకాపూర్వ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ఓ పేద కుటుంబానికి రూ. 7,700 విద్యుత్ బిల్లు వచ్చింది. బిల్లు ఎందుకొచ్చిందో? ఆ బిల్లు ఎలా చెల్లించాలో తెలియక ఆ ఇంటి యజమాని అధికారుల చుట్టు తిరిగాడు. అయినా ఫలితం కనిపించలేదు. అయితే కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ అధికారులు అతని ఇంటికి పవర్ కనెక్షన్ తీసేశారు. దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు.


అతను హైటెన్షన్ వైర్ పైకి ఎక్కడంతో ఆ కుటుంబం, స్థానికులు ఆందోళనకు లోనయ్యారు. గ్రామస్తులు ఓ వల తీసుకువచ్చి ఆ వ్యక్తిని కిందకు దిగమని బ్రతిమలాడారు. నాలుగైదు గంటలపాటు వైర్లపై కూర్చున్న వ్యక్తి... బ్యాలన్స్ తప్పి కింద పడబోయాడు. గ్రామస్తులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచిన వలలో అతనిని జాగ్రత్తగా కిందికి దించారు. అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు విచ్చినప్పటి నుంచి తన భర్త తిండి తిప్పలు మానేసి, మతి స్థిమితం కోల్పోయినవాడిలా ప్రవర్తిస్తున్నాడని అతని భార్య తెలిపింది. డిస్కమ్ అధికారులు మాత్రం భార్య భర్తల గొడవలవల్లే ఆ వ్యక్తి హై టెన్షన్ వైర్ ఎక్కాడని చెబుతున్నారు. చివరికి ఆ వ్యక్తి క్షేమంగా కిందికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-07-18T20:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising