ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court: పిల్లల సంరక్షణ తండ్రి బాధ్యత

ABN, First Publish Date - 2022-12-31T09:19:58+05:30

విభేధాల కారణంగా భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి పూందమల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. తిరుచ్చిలోని తల్లిదండ్రుల వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మద్రాసు హైకోర్టు

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 30: విభేధాల కారణంగా భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి పూందమల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. తిరుచ్చిలోని తల్లిదండ్రుల వద్ద 11 నెలల చిన్నారితో ఉంటున్న కారణంగా, తాను తిరుచ్చి నుండి పూందమల్లికి వెళ్లలేనని, కేసు విచారణ తిరుచ్చికి మార్చాలంటూ వివాహిత మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేసింది. ఈ కేసు న్యాయమూర్తి ఎంఎస్‌ సుబ్రమణ్యం విచారించగా, 11 నెలల చిన్నారి ఖర్చులకు భర్త ఎలాంటి జీవనభృతి ఇవ్వలేదని భార్య తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు. కానీ, చిన్నారిని చూసేందుకు అనుమతించని తాను జీవనభృతి ఎలా ఇస్తానని, దంత వైద్యురాలిగా పనిచేస్తున్న భార్య పూందమల్లికి వచ్చిన వెళ్లడంలో ఎలాంటి ఇబ్బంది లేవని భర్త తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరుతరఫు వాదనలు విన్న న్యాయమూర్తి, చిన్నారి విద్య, జీవనానికి అవసరమైన ఆర్ధికసాయం చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉందని, భర్తను విడిచివెళ్లి చిన్నారిని సంరక్షించాల్సి బాధ్యత తాత-అవ్వలకు అప్పగించడం వేదన కలిగిస్తుందన్నారు. సంపాదించే తండ్రి పిల్లల సంరక్షణ బాధ్యత నుంచి తప్పించుకుంటే సహించేది లేదని, జీవనభృతి ఇవ్వాలంటూ పిటిషన్‌ వేయకపోయినా భృతి ఇవ్వాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందన్నారు. పిల్లలను చూసేందుకు అనుమతించలేదనే కారణంగా జీవన భృతి ఇచ్చేందుకు నిరాకరించరాదన్న న్యాయమూర్తి, విడాకుల రద్దు కేసు విచారణ తిరుచ్చికి బదిలీ చేస్తూ, చిన్నారికి నెలకు రూ.5 వేల జీవనభృతి ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-12-31T09:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising