ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy to very heavy rainfall:బంగాళాఖాతంలో అల్పపీడనం...పలు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABN, First Publish Date - 2022-08-19T14:45:39+05:30

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం(Low-Pressure)వల్ల పలు రాష్ట్రాల్లో శుక్రవారం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం(Low-Pressure)వల్ల పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు(next three days) భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy to very heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ(India Meteorological Department) వెల్లడించింది. తూర్పు, సెంట్రల్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో(IMDs rainfall prediction) తెలిపింది. 


పశ్చిమబెంగాల్, సిక్కిం, విదర్భ, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో ఆగస్టు 20వతేదీన అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, హిమాలయన్ రీజియన్ ప్రాంతాల్లో ఆగస్టు 22వతేదీన అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ ప్రాంతాల్లో ఆగస్టు 20వతేదీన పిడుగులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దక్షిణ భారతదేశంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.ఒడిశా రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 


ఈ నెల18 నుంచి 22వ తేదీల వరకు పశ్చిమ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్, తూర్పు రాజస్థాన్‌, జమ్మూ అండ్ కాశ్మీర్,పంజాబ్‌ రాష్ట్రాల్లో  విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.


Updated Date - 2022-08-19T14:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising