ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

March fast: భారీ భద్రత నడుమ ఇండిపెండెన్స్‌ మార్చ్‌ ఫాస్ట్‌

ABN, First Publish Date - 2022-08-07T15:42:15+05:30

ఈ నెల 15వ తేదీన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) వేడుకలను జరుపుకొనేందుకు సిద్ధమవుతుంది. ఇం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), ఆగస్టు 6: ఈ నెల 15వ తేదీన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) వేడుకలను జరుపుకొనేందుకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై నగర పోలీసులు ఇండిపెండెన్స్‌ రిహార్సల్‌ నిర్వహించారు. స్థానిక సచివాలయం(Secretariat) వద్ద భారీ భద్రత నడుమ దీన్ని నిర్వహించారు. ఈ కవాతు కారణంగా సచివాలయం మీదుగా వచ్చేపోయే అన్ని వాహనాలను రాజా అన్నామలై మండ్రం జంక్షన్‌, ముత్తుస్వామి వంతెన మీదుగా తిప్పి పంపించారు. మెరీనా నుంచి వచ్చే అన్ని వాహనాలను శివానంద రోడ్డు(Sivananda Road) మీదుగా మళ్ళించారు. శనివారం జరిగినట్టుగానే ఈ నెల 11, 13 తేదీల్లో కూడా మరోమారు రిహార్సల్‌ నిర్వహించనున్నారు ఆ తర్వాత 14, 15 తేదీల్లో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మార్పులు చేస్తారు. కాగా, సచివాలయం వద్ద జార్జికోటపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ నెల 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీ భద్రత కల్పించనున్నారు. 

Updated Date - 2022-08-07T15:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising