ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

heavy rains: సేలం, ఈరోడ్‌ జిల్లాల్లో భారీవర్షాలు

ABN, First Publish Date - 2022-10-17T14:26:24+05:30

ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప వాయుపీడనం కారణంగా సేలం, ఈరోడ్‌ తదితర డెల్టా జిల్లాల్లో కురుస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భవానిసాగర్‌ వద్ద వరద ఉధృతిఫ జల దిగ్భంధంలో వందలాది ఇళ్లు

చెన్నై/ప్యారీస్‌: ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప వాయుపీడనం కారణంగా సేలం, ఈరోడ్‌ తదితర డెల్టా జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలకు జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రజాపనుల శాఖ అధికారులు సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి ఆదివారం ఉదయం విడుదల చేసిన 1.85 లక్షల ఘనపుటడుగుల నీటి వల్ల వరద ముప్పు పొంచి ఉందని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేశారు. ఈరోడ్‌ జిల్లా కావేరి నది పరీవాహక ప్రాంతాలైన కందన్‌నగర్‌, కావేరినగర్‌, అందియూర్‌ ఎక్స్‌టెన్షన్‌, బసవేశ్వర్‌ కాలని, పాత వంతెన, కుప్పం, నేతాజీ నగర్‌ సహా 100కు పైగా నివాస ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. ఈ ప్రాంతాల్లోని సుమారు 500లకు పైగా కుటుంబాలను రెవెన్యూ శాఖ ఏర్పాటుచేసిన శిబిరాలకు తరలించారు. కరుగల్‌పాళయం నది కాలువలో వరద నీరు పొంగి పొర్లుతుండడంతో ఇలపుతోపు, ఛత్రపట్టి తదితర ప్రాంతాల్లోని దాదాపు 270 ఇళ్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అందియూర్‌ సమీపంలో ఉన్న కల్వర్టుపై వరద ఉధృతరూపం దాల్చుతున్న సమయంలో బైక్‌పై కల్వర్టు దాటేందుకు యత్నించి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు.

బర్గూరులో భారీ వర్షం

అడయార్‌: ఈరోడ్‌ జిల్లా ఆందియూరు, బర్గూరు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. దీంతో ఆందియూర్‌ నుంచి బర్గూరుకు వెళ్ళే రహదారిలో ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా చెన్నై - బెంగుళూరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి బర్గూరు, రామాపురం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళే వాహనాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేరకు నిలిచిపోయాయి. అలాగే, కొండ దిగువ ప్రాంతంలోని దాదాపు 30కి పైగా కొండ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బర్గూరు మార్గంలో విరిగిపడిన కొండ చరియలను కార్మికులు తొలగిస్తున్నారు.

Updated Date - 2022-10-17T14:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising