Heavy rains: భారీ వర్షాలకు నిండిన క్వారీ ప్రాంతాలు
ABN, First Publish Date - 2022-12-15T09:51:32+05:30
స్థానిక పూందమల్లి సమీపం సిక్కరాయపురంలోని రాళ్ల క్వారీలు పూర్తిస్థాయిలో నిండాయి. 2019లో నగరంలో ఏర్పడిన తీవ్ర తాగునీటి
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 14: స్థానిక పూందమల్లి సమీపం సిక్కరాయపురంలోని రాళ్ల క్వారీలు పూర్తిస్థాయిలో నిండాయి. 2019లో నగరంలో ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి కారణంగా వేలూరు(Vellure) జిల్లా జోలార్‌పేట నుంచి రైళ్ల ద్వారా నీటిని తరలించారు. అలాగే, తిరువళ్లూర్, కాంచీపురం(Thiruvallur, Kanchipuram) జిల్లాల్లోని వ్యవసాయ బావుల నుంచి నగర ప్రజలకు తాగునీరు సరఫరా అయింది. ఆ సమయంలో పూందమల్లి సమీపంలోని సిక్కరాయపురంలో ఉన్న రాళ్ల క్వారీల్లోని నీరు కూడా ఎంతో వినియోగపడింది. ఈ నీటిని శుద్ధీకరించి లారీల ద్వారా నగరానికి తరలించారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సిక్కరాయపురంలోని మూడు భారీ క్వారీలు పూర్తిగా నిండాయి. ఈ క్వారీల దగ్గరకు ప్రజలు స్నానాలు, బట్టలుతికేందుకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2022-12-15T09:51:34+05:30 IST