ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: భారీ వర్షాలకు 64 మంది బలి

ABN, First Publish Date - 2022-08-07T16:48:27+05:30

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జూన్‌ 1 నుంచి ఆగస్టు 5వరకు మొత్తం 64మంది మృతి చెందారని 14 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జూన్‌ 1 నుంచి ఆగస్టు 5వరకు మొత్తం 64మంది మృతి చెందారని 14 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌(Revenue Minister R Ashok) వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరు(Capital is Bangalore) శివారు ప్రాంతాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు దిగాలుతో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు చేరుతుండడంతో పెద్దసంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల జిల్లాల్లో సహాయ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షనేత సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. తక్షణం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను ఆదుకోవాలని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(JDS leader and former CM Kumaraswamy) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బళ్లారి జిల్లాతో పాటు పల్లు జిల్లాల్లో అస్తవ్యస్తమైన జనజీవనాన్ని బాగు చేయాలంటే ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని పలువురు కోరారు.

Updated Date - 2022-08-07T16:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising