ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asani తుపాన్ ఎఫెక్ట్...నేడు భారీవర్షాలు

ABN, First Publish Date - 2022-03-21T12:46:45+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తుండటంతో అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఆర్‌కే జనమణి తెలిపారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తుండటంతో అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఆర్‌కే జనమణి తెలిపారు. సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంసోమవారం సాయంత్రం నాటికి ఇది తుపానుగా మారుతుంది. ఈ తుపానుకు అసనిగా పేరు పెట్టామని శ్రీ జనమణి చెప్పారు. శనివారం సాయంత్రం నాటికి ఆగ్నేయ దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.అసని తుపాన్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అండమాన్‌లో సైన్యాన్ని అప్రమత్తం చేసింది. 


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార్ నికోబార్‌కు ఉత్తర-ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో పోర్ట్ బ్లెయిర్‌కు (అండమాన్ దీవులు) ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తదుపరి తీవ్ర అల్పపీడనంగా మారనుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అసని తుపాను నేపథ్యంలో బంగాళాఖాతంలోకి నావికులు, మత్స్యకారులు వెళ్లవద్దని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.అండమాన్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు.


తుపాన్ దృష్ట్యా  ఫిషింగ్, టూరిజం. షిప్పింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. మత్స్యకారులు సముద్రం నుంచి తిరిగి రావాలని ఐఎండీ అధికారులు సూచించారు.అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే సహాయం అందించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Updated Date - 2022-03-21T12:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising