ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: కూలిన పూజామండపాలు...పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-10-05T12:46:05+05:30

అల్పపీడన ప్రభావం వల్ల ఒడిశా(Odisha) రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు(Heavy rain), పిడుగుపాటుకు(lightning) ముగ్గురు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): అల్పపీడన ప్రభావం వల్ల  ఒడిశా(Odisha) రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు(Heavy rain), పిడుగుపాటుకు(lightning) ముగ్గురు మరణించారు. భారీవర్షాలతోపాటు భారీగా వీచిన గాలుల వల్ల దుర్గాపూజ మండపాలు కుప్పకూలాయి. ఒడిశా రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, భారీగాలుల వల్ల పలు కోస్తా జిల్లాల్లో పలు చెట్లు కూలిపోయాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఒక్క భద్రక్ జిల్లాల్లోనే 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భువనేశ్వర్( Bhubaneswar) వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ బిశ్వాస్ చెప్పారు. భద్రక్ జిల్లాకేంద్ర ఆసుపత్రిలో వరదనీరు రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జాజ్ పూర్, పూరి, ఖుర్దా, ఛంద్ బలి, కటక్, బారిపద జిల్లాల్లో భారీవర్షం కురిసింది. 


బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర జిల్లాలు(Andhra Pradesh coast), ఒడిశా రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. బాలాసోర్, జాజ్ పూర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.కటక్, భువనేశ్వర్ నగరాల్లో భారీవర్షాల వల్ల పూజామండపాలు కూలిపోయాయి. 

Updated Date - 2022-10-05T12:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising