ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీ,తెలంగాణాతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ABN, First Publish Date - 2022-09-20T16:34:57+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణతో(Telangana) సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు(Heavy rain)కురుస్తాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణతో(Telangana) సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు(Heavy rain)కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారత వాతావరణశాఖ(Indian Meteorological Department) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో(Weather updates) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్(yellow alert) జారీ చేసింది. ఒడిశా రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆరంజ్ అలర్ట్(orange alert) జారీ చేసింది. 


ఒడిశా రాష్ట్రంలోని  కొండ ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశముంది. ఒడిశాలోని లోతట్టుప్రాంతాలు వరదనీటిలో మునిగి పోయే ప్రమాదం ఉందని ఐఎండీ(imd) హెచ్చరించింది.తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్(hyderabad) వాతావరణకేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు. 


Updated Date - 2022-09-20T16:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising