ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వేసుకోవడంపై ప్రజల్లో నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2022-04-22T16:23:43+05:30

రాష్ట్రంలో కరోనా నిబంధనల సడలింపు అనంతరం టీకాలు వేయించుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపించడం లేదని, తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం 51.71 లక్షల మంది ఇప్పటివరకు మొదటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా నిబంధనల సడలింపు అనంతరం టీకాలు వేయించుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపించడం లేదని, తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం 51.71 లక్షల మంది ఇప్పటివరకు మొదటి డోస్‌ టీకా కూడా వేయించుకోలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 1.38 కోట్ల టీకాలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 1.28 కోట్ల టీకాల కాలపరిమితి మరో ఐదు నెలల్లో ముగియనుందని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనల మేరకు రాష్ట్రంలో ఇంకా కోటి మందికి పైగా రెండో డోస్‌ వేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పలు నగరాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని, కరోనాను టీకాతో నిరోధించవచ్చని, టీకాలు వేసుకోని వారు సత్వరం ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి వ్యాక్సిన్‌ వేసుకోవాలని, లేని పక్షంలో టీకాలు వృధా అయ్యే అవకాశముందన్నారు. అలా వృధా అయ్యే పక్షంలో పొరుగు రాష్ట్రాలకు పంపించాలనే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే బూస్టర్‌ డోస్‌కు అనుమతించారని, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే త్వరలో ప్రభుత్వాసుపత్రుల్లో కూడా వేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-04-22T16:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising