ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు

ABN, First Publish Date - 2022-03-08T15:58:11+05:30

రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. స్థానిక రాయపురంలోని రాజాసర్‌ రామస్వామి మొదలియార్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌ఎం) ప్రభుత్వాస్పత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - మంత్రి సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. స్థానిక రాయపురంలోని రాజాసర్‌ రామస్వామి మొదలియార్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌ఎం) ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన నాలుగు కేఎల్‌ ద్రవ ఆక్సిజన్‌ ప్లాంట్లను సోమవారం మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. రాయపురం ఎమ్మెల్యే ఐడ్రీమ్‌ మూర్తి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌, వైద్య విద్యా డైరెక్టర్‌ డా.నారాయణబాబు, స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల డీన్‌ డా.బాలాజి, ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రాజ్యలక్ష్మి, 48వ వార్డు కౌన్సిలర్‌ ఇళయ అరుణ, ఏగం ట్రస్ట్‌ అధ్యక్షుడు శ్రీధర్‌, హెచ్‌సీఎల్‌ నిర్వాహకురాలు డా.చేతన తదితరులు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో గర్భిణి మహిళల సంక్షేమం కోసం గ్రీన్‌ చైల్డ్‌ విభాగాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో మెరుగైన వైద్య వసతులు అందుబాటులో ఉన్నందువల్ల రాష్ట్రవ్యాప్తంగా శిశువులు, బాలింతలు మరణాలు గణనీయంగా తగ్గాయని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచనల మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-03-08T15:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising