ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తగ్గుముఖం.. అయినా అప్రమత్తం: మంత్రి

ABN, First Publish Date - 2022-03-20T14:02:38+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని, గత పదిరోజులుగా కరోనా బాధితులెవరూ మృతి చెందలేదని, అయినా ప్రజలు ఆ వైరస్‌ పట్ల అప్రమత్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని, గత పదిరోజులుగా కరోనా బాధితులెవరూ మృతి చెందలేదని, అయినా ప్రజలు ఆ వైరస్‌ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, కరోనా నిరోధక నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక టి.నగర్‌ థామస్‌ రోడ్డులో ఏర్పాటైన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ శిబిరాన్ని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఈ నెల 27 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని, పొరుగు రాష్ట్రమైన కేరళలో వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్నదని, ఈ పరిస్థితులలో ప్రజలంతా కరోనా నిరోధక నిబంధనలను తుచ తప్పక పాటించాలన్నారు. కేరళ సరిహద్దులలో ఆరోగ్య సిబ్బంది తీవ్ర నిఘా వేస్తున్నారని, ఆ రాష్ట్రం నుండి వచ్చే వాహన చోధకులకు థర్మల్‌ స్కాన్‌ పరీక్షలు కూడా చేస్తున్నారని చెప్పారు. నాలుగో విడతగా కరోనా వైరస్‌ వ్యాపించినా రాష్ట్రంలో బాధితులెవరూ మృతి చెందే ప్రసక్తి ఉండదని, దీనికి కారణంగా అందరూ టీకాలు వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటమేనని చెప్పారు. 

Updated Date - 2022-03-20T14:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising