పరదా కప్పితేనే పంట..!
ABN, First Publish Date - 2022-12-07T11:56:42+05:30
పంట పెట్టడం ఒక ఎత్తయితే.. దానిని కాపాడుకోవడానికి రైతులు పడేపాట్లు మరో సమస్య. అతివృష్టి, అనావృష్టితో పాటు చీడపీడల నుంచి
కంప్లి(బెంగళూరు), డిసెంబరు 6 : పంట పెట్టడం ఒక ఎత్తయితే.. దానిని కాపాడుకోవడానికి రైతులు పడేపాట్లు మరో సమస్య. అతివృష్టి, అనావృష్టితో పాటు చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి రైతులు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంభిస్తుంటారు. దానిమ్మ పంట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉం టుంది. ఏ మాత్రం ఏమారినా పంటను చీడపీడలు ముట్టడిస్తాయి. ఈ నేపథ్యంలో దానిమ్మ పంటకు పరదా కప్పడం ద్వారా కాపాడుకుంటున్నారు. కంప్లి, కురుగోడు తాలూకా పరిధిలోని గ్రామాల్లో రైతులు దానిమ్మ పంటలకు పరదా వేసి చీడపీడల నుంచి కాపాడుకుంటున్నారు. వా తావరణంలో మార్పులకు పంటపై తెగుళ్లు సోకుతుండటంతో పాటు దిగుబడి తగ్గిపోతుండటంతో తోటల శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పరదాలు కప్పుతున్నారు. కురుగోడు పరిధిలోని కలకంబ్ల గ్రామం వద్ద నాలుగు ఎకరాల్లో రైతు మల్లేష్ తను సాగు చేసిన దానిమ్మ పంటకు పరదా కప్పారు. దీనిపై రైతు మాట్లాడుతూ.. తుఫాను ప్రభావం, వాతావరణంలో జరిగే మార్పులతో పంటలకు తెగుళ్లు ఆశించి దిగుబడి తగ్గుతుండటంతో తోటల శాఖ అధికారులకు పంటను చూపించగా ఈ విధంగా పరదా కప్పాలని సూచించినట్లు తెలిపారు. అంజూర, పత్తి, మొక్కజొన్న తదితర పంటలతో పోల్చితే దానిమ్మను అతి సూక్ష్మంగా చూసుకోవాలని లేకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని వివరించారు.
Updated Date - 2022-12-07T11:56:44+05:30 IST