ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harghar Tiranga Abhiyan: తరలి వచ్చిన విద్యార్థిలోకం

ABN, First Publish Date - 2022-08-14T16:50:02+05:30

త్రివర్ణ పతాకాలతో బళ్లారి నగరం కలకలలాడింది. విమ్స్‌, మున్సిపల్‌ కళాశాల, బసవ భవన్‌, వార్డులతోపాటు నగరంలోని ఐదు ప్రాంతాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి సిటీ(బెంగళూరు), ఆగస్టు 13: త్రివర్ణ పతాకాలతో బళ్లారి నగరం కలకలలాడింది. విమ్స్‌, మున్సిపల్‌ కళాశాల, బసవ భవన్‌, వార్డులతోపాటు నగరంలోని ఐదు ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు శనివారం త్రివర్ణ పతాకాలను చేతపట్టుకొని గవియప్ప సర్కిల్‌కు తరలివచ్చారు. ముందుగా విమ్స్‌ గ్రౌండులో వందలాది మంది విద్యార్థుల ఊరేగింపును మంత్రి శ్రీరాములు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో విద్యార్థులు 750 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని కాలినడకన జాతీయ భక్తిగీతాలు ఆలపిస్తూ దండులా సాగిపోయారు. హర్‌ఘర్‌ తిరంగా అభియాన్‌(Harghar Tiranga Abhiyan)లో భాగంగా 150 అడుగుల జెండా స్తంభంపై జాతీయ జెండాను ఎగుర వేసేందుకు వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చారు. లక్షలాది మంది ప్రజల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని మంత్రి శ్రీరాములు(Minister Sriramulu) పేర్కొన్నారు. వెయ్యిమందికి పైగా సైనికులతో కూడిన గెరిల్లా యుద్ధంతో సంగొళ్లి రాయన్న ఆంగ్లేయులకు కునుకు లేకుండా చేశాడన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పవన్‌ కుమార్‌ మాలపాటి, ఎస్పీ సైదులా ఆదావత్‌, నగర ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, విధాన పరిషత్‌ సభ్యుడు యం.సతీశ్‌, మేయర్‌ ఎం.రాజేశ్వరి, బుడా అధ్యక్షుడు పి.పాలన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T16:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising