ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jail భయంతోనే Congressకు రాజీనామా: Hardikపై పార్టీ చీఫ్ ఫైర్

ABN, First Publish Date - 2022-05-20T19:07:39+05:30

తనను పార్టీ తక్కువ చేసిందని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని హార్దిక్ అంటున్నారు. ఇదంతా అబద్దం. పార్టీ ఆయనకు ప్రతీది ఇచ్చింది. ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను స్టార్ క్యాంపెయినర్‌ను చేసింది. హెలికాఫ్టర్ కూడా ఇచ్చింది. బీజేపీ సూచనల మేరకే హార్దిక్ మాట్లాడుతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మాదాబాద్: కాంగ్రెస్(Congress) పార్టీకి హార్దిక్ పటేల్(Hardik Patel) రాజీనామా చేయడానికి కారణం జైలుకు వెళ్తానన్న భయంతోనేనని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్(Jagdish Thakor) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే దేశద్రోహం కేసులు నమోదు అవ్వొచ్చని హార్దిక్‌ భావించారని, ఆ భయంతోనే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. వాస్తవానికి తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, అంతర్గత కుమ్ములాటలను అధిష్టానం పట్టించుకోవడం లేదని రాజీనామా అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చారు.


కాగా, హార్దిక్ చేసిన ఆరోపణలను జగదీష్ ఠాకూర్ ఖండించారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘తనను పార్టీ తక్కువ చేసిందని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని హార్దిక్ అంటున్నారు. ఇదంతా అబద్దం. పార్టీ ఆయనకు ప్రతీది ఇచ్చింది. ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను స్టార్ క్యాంపెయినర్‌ను చేసింది. హెలికాఫ్టర్ కూడా ఇచ్చింది. బీజేపీ సూచనల మేరకే హార్దిక్ మాట్లాడుతున్నారు. రాజీనామా లేఖ కూడా బీజేపీ ఆఫీసు నుంచి వచ్చిందే’’ అని అన్నారు.

Updated Date - 2022-05-20T19:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising