ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

June 2న BJPలో చేరనున్న Hardik Patel

ABN, First Publish Date - 2022-05-31T19:08:12+05:30

June 2న BJPలో చేరనున్న Hardik Patel

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ నేత(Former Congress leader), పటేల్ ఉద్యమ(Patidar quota agitation) నాయకుడు హార్దిక్ పటేల్(Hardik Patel) జూన్ 2న భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తీర్థం పుచ్చుకోనున్నారు. గుజరాత్ బీజేపీ అధినేత సీఆర్ పాటిల్(C R Paatil) హార్దిక్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి యగ్నేష్ దావె మంగళవారం తెలిపారు. అంతర్గత కుమ్ములాటలే కానీ ప్రజా సమస్యలపై పార్టీ దృష్టిపెట్టదంటూ తీవ్ర విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీని వీడిన హార్దిక్.. తొందరలోనే బీజేపీలో చేరతారని ముందు నుంచే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూనే తాజాగా బీజేపీ నుంచే అధికారిక ప్రకటన వచ్చింది.


పాటిదార్ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో బీజేపీపై హార్దిక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మూడేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అనంతరం.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్నాయనగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనికి కొద్ది రోజుల ముందు నుంచి బీజేపీపై కాస్త మృదువుగా స్పందిస్తూ వచ్చారు. బీజేపీ నేతలను బహిరంగంగానే పొగిడారు. ఏంటని ప్రశ్నిస్తే ప్రశంసనీయంగా ఉన్నప్పుడు ప్రశంసించాల్సిందేనంటూ బదులిచ్చారు.

Updated Date - 2022-05-31T19:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising