ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayman al-Zawahiri: అల్ ఖైదా చీఫ్‌పై అమెరికా దాడిలో హక్కానీ కుటుంబ సభ్యులు హతం

ABN, First Publish Date - 2022-08-05T00:45:22+05:30

అల్ ఖైదా చీఫ్ అయమన్ అల్ జవహరి (Ayman al-Zawahiri)పై అమెరికా దాడి చేసిన అంతమొందించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: అల్ ఖైదా చీఫ్ అయమన్ అల్ జవహరి (Ayman al-Zawahiri)పై అమెరికా దాడి చేసి అంతమొందించిన  ఘటనలో హక్కానీ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తజకిస్థాన్‌లో ఆఫ్ఘనిస్థాన్ రాయబారి మహమ్మద్ జహీర్ అఘ్బర్(Mohammad Zahir Aghbar) తెలిపారు.


ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను జలాలుద్దీన్ హక్కానీ(Jalaluddin Haqqani) స్థాపించాడు. సోవియట్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తిరుగుబాటు కమాండర్‌‌గా ఎదిగాడు. కాబూల్ నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం.. హక్కానీ గ్రూపునకు చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు మరణించారని జహీర్ అఘ్బర్ పేర్కొన్నారు. ఆ ఇల్లు హక్కనీలదేనని, వారు కాబూల్‌ను విడిచి వెళ్లిపోయారని అన్నారు. 

 

కాబూల్‌లో ఆల్‌ఖైదా నేత జవహరి తలదాచుకున్న బహుళ అంతస్తుల భవనం ఆఫ్ఘనిస్థాన్ అంతర్గతశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ (Sirajuddin Haqqani)కి చెందినది. సిరాజుద్దీన్ హక్కానీతోపాటు అగ్రనేతలు కాబూల్‌లోని సురక్షితమైన నివాసాలను వదిలిపెట్టి వేరే ఎక్కడికో వెళ్లిపోయి తలదాచుకున్నట్టు రాయబారి తెలిపారు. ఆప్ఘనిస్థాన్‌లో ఇంకా పలు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని అన్నారు. జవహరిని చంపడం ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు అంత ముఖ్యమైనదేమీ కాదని, తాలిబన్ల రక్షణలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగిపోతోందన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం గమనించడమే తమకు ముఖ్యమని అన్నారు.


ఆల్‌ఖైదా నేతల ఆచూకీని వెల్లడించడంలో పాకిస్థాన్ ప్రమేయంపై జహీర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌లోని చాలా విషయాలను అది తెలుసుకోగలదని అన్నారు.   


Updated Date - 2022-08-05T00:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising