ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Water horse: హంపి జూకు నీటి గుర్రం

ABN, First Publish Date - 2022-09-22T17:34:35+05:30

విజయనగరం జిల్లా హొసపేట తాలూకా కమలాపురం సమీపంలోని అటల్‌ బిహారి వాజపేయి బయోలాజికల్‌ పార్కు(హంపి జూ)కు ఇప్పుడు మరో కొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(బెంగళూరు) సెప్టెంబరు 21: విజయనగరం జిల్లా హొసపేట తాలూకా కమలాపురం సమీపంలోని అటల్‌ బిహారి వాజపేయి బయోలాజికల్‌ పార్కు(హంపి జూ)కు ఇప్పుడు మరో కొత్త అతిథి వచ్చింది. బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్‌ బయోలాజికల్‌ పార్కు నుంచి ఇటీవల నీటి గుర్రం (హిప్పొపొటామస్‌) హంపి జూకు చేరింది. ఇది స్థానిక వాతావరణానికి అనుగుణంగాస్వేచ్ఛగా తిరుగుతుంది. ప్రస్తుతం మగ నీటి గుర్రం రాగా, మరికొద్ది రోజుల్లో మరో ఆడ నీటిగుర్రాన్ని కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హంపి(Hampi)లో వీటి కోసం అర ఎకరం భూమిని కేటాయించారు. ఇవి నివాసం ఉండటానికి వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. నీటి గుర్రం 4 నుంచి 5 అడుగుల పొడవు, రెండు టన్నుల కంటె ఎక్కువ బరువు ఉంటుంది. దీనికి ప్రతిరోజూ 30 నుంచి 35 కిలోల కూరగాయాలు, పండ్లు పెడతారని జూ సిబ్బంది తెలిపారు. మినీ జూలో ఇప్పటికే  చిరుత, ఎలుగుబంటి, తోడేలు, ఇతర జంతువులు ఉన్నాయి. పార్కులో మొత్తం ఐదుపులులు, మూడుసింహాలు ఉన్నాయి. చిన్న జంతుప్రదర్శన శాలకు ఒక్కొక్కటిగా కొత్త జంతువులు వస్తుండటంతో వాటిని చూడాలనుకునేవారి సంఖ్య రోజురోజుకూపెరుగుతోంది. దీంతో పార్కు ఆదాయం కూడా పెరుగుతోంది.

Updated Date - 2022-09-22T17:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising