ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pak journalist ను పిలవలేదు: Former VP Ansari

ABN, First Publish Date - 2022-07-15T21:41:02+05:30

తనను భారత్‌కు పిలిచారని పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మిర్జా చేసిన ఆరోపణలపై మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ క్లారిటీ ఇచ్చారు. తాను ఆమెను ఎలాంటి కాన్ఫరెన్స్‌కు పిలవలేదని, నుస్రత్ ఎవరనేది తనకు తెలియదని, ఈ విషయమై రెండు రోజుల క్రితం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తనను భారత్‌కు పిలిచారని పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మిర్జా చేసిన ఆరోపణలపై మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ క్లారిటీ ఇచ్చారు. తాను ఆమెను ఎలాంటి కాన్ఫరెన్స్‌కు పిలవలేదని, నుస్రత్ ఎవరనేది తనకు తెలియదని, ఈ విషయమై రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని శుక్రవారం ఆయన తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా ఆరోపణలు చేస్తున్నారు. 2010లో జరిగిన కాన్ఫరెన్స్‌కు హమీద్ అన్సారీ ఆహ్వానం మేరకు తాను హాజరైనట్లు సైతం ఆరోపించారు. కాగా, నుస్రత్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హమీద్ అన్సారీ అన్నారు. కాగా, మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్‌ అన్సారీ ఇరాన్‌లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది.

Updated Date - 2022-07-15T21:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising