ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gyanvapi case దర్యాప్తు చేస్తున్న వారాణసీ జడ్జీకి బెదిరింపు లేఖ

ABN, First Publish Date - 2022-06-08T12:32:16+05:30

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో సర్వేకు ఆదేశించిన వారాణసీ సివిల్ జడ్జి రవి దివాకర్‌కు తాజాగా బెదిరింపు లేఖ వచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారాణసీ(ఉత్తరప్రదేశ్): జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో సర్వేకు ఆదేశించిన వారాణసీ సివిల్ జడ్జి రవి దివాకర్‌కు తాజాగా బెదిరింపు లేఖ వచ్చింది. తనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు మంగళవారం తెలిపారు.ఇస్లామిక్ అఘాజ్ మూవ్‌మెంట్‌కు చెందిన కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి నుంచి తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వారాణసీ సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ చెప్పారు.న్యాయమూర్తి రవి దివాకర్ వివాదాస్పద జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్‌లో సర్వేకు ఆదేశించారు.గతంలో సుప్రీంకోర్టు జ్ఞానవాపీ కేసును సివిల్ కోర్టు నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. తదుపరి విచారణ జులై 4న జరగనుంది.ప్రస్తుతం భారతదేశంలో న్యాయవ్యవస్థ కూడా కాషాయ రంగును సంతరించుకుందని బెదిరింపు లేఖలో పేర్కొన్నట్లు జస్టిస్ దివాకర్ చెప్పారు.


ఈ బెదిరింపు లేఖ గురించి న్యాయమూర్తి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శికి సమాచారం అందించారు.ఈ లేఖ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.జడ్జీకి ఇప్పటికే భద్రత కల్పించినట్లు వారాణసీ పోలీస్ కమిషనర్ తెలిపారు. న్యాయమూర్తి, అతని కుటుంబానికి రక్షణగా 9మంది పోలీసులను మోహరించారు.జ్ఞానవాపి కేసుతో సంబంధం ఉన్న పిటిషనర్లు,న్యాయవాదులందరికీ పోలీసులు రక్షణ కల్పించారు.

Updated Date - 2022-06-08T12:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising