ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజిటేరియన్ ఫ్యామిలీకి Chicken Curry.. రెస్టారెంట్‌కు రూ. 20వేల జరిమానా!

ABN, First Publish Date - 2022-07-17T22:10:35+05:30

వెజ్ కర్రీ ఆర్డర్ చేస్తే పొరపాటున చికెన్ కర్రీ పంపిన రెస్టారెంట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాలియర్: వెజ్ కర్రీ ఆర్డర్ చేస్తే పొరపాటున చికెన్ కర్రీ పంపిన రెస్టారెంట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌(Gwalior)లో జరిగిందీ ఘటన. నగరంలో ప్రముఖ రెస్టారెంట్ అయిన జివాజ్ క్లబ్‌ (Jiwaji Club)లో అడ్వకేట్ సిద్ధార్థ శ్రీవాస్తవ సభ్యుడు. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) ద్వారా మటర్ పనీర్‌ (Matar Paneer)ను ఆర్డర్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఆర్డర్ డెలివరీ కావడంతో శ్రీవాస్తవ కుటుంబం దానిని విప్పి చూసి ఒక్కసారిగా షాకైంది. అందులో తాము ఆర్డర్ చేసిన మటర్ పనీర్‌కు బదులుగా చికెన్ కర్రీ (Chicken Curry) రావడంతో వారు విస్తుపోయారు.


శ్రీవాస్తవది పూర్తిగా శాకాహార కుటుంబం కావడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. విషయాన్ని క్లబ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. క్లబ్ నిర్లక్ష్యం కారణంగా మానసికంగా, శారీరకంగా తమకు నష్టం వాటిల్లిందని శ్రీవాస్తవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారించిన వినియోగదారుల ఫోరం పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.


క్లబ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. చికెన్ కర్రీని చూసిన వారిపై తీవ్ర ప్రభావం పడిందని, కొన్ని రోజుల పాటు ఇతర ఆహార పదార్థాలను వారు తీసుకోలేకపోయారని పేర్కొంది. ఈ ఘటన వారిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీసిందని పేర్కొంటూ క్లబ్‌ కిచెన్‌కు రూ. 20వేల జరిమానా విధించింది. అంతేకాకుండా కేసుకు అయిన మొత్తాన్ని కూడా చెల్లించాలని ఆదేశించింది.


కాగా, ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలో ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ వెజిటేరియన్ పిజ్జా ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ పిజ్జా వచ్చింది. దీంతో ఆమె కూడా వినియోగదారుల ఫోరం తలుపు తట్టింది. తమ మతపరమైన విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా సుదీర్ఘకాలంపాటు మానసిక వేదనకు గురిచేసిందని పేర్కొంది. కోటి రూపాయల పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ వినియోగదారుల ఫోరంలో కేసు వేసింది.

Updated Date - 2022-07-17T22:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising