ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్...అసోంకు తరలింపు

ABN, First Publish Date - 2022-04-21T14:25:39+05:30

గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు బుధవారం అర్థరాత్రి అరెస్ట్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు బుధవారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు.బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద  జిగ్నేష్ మేవానీని అరెస్టు చేశామని అసోం  పోలీసులు ట్వీట్ చేశారు.జిగ్నేష్ మేవానీ అరెస్ట్ వార్తను ఆయన మద్దతుదారులు కూడా ధృవీకరించారు. కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేసే సమయంలో పోలీసుల వద్ద ఎఫ్‌ఐఆర్ కాపీ లేదని వారు ఆరోపించారు.కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ట్వీట్ ఆధారంగా జిగ్నేష్ మేవానీపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేందుకు కుట్ర పన్నడం, సమాజాన్ని అవమానించడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అసోం పోలీసులు కేసు నమోదు చేశారు.


అసోం పోలీసులు జిగ్నేష్ మేవానీని అహ్మదాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి రైలులో గువాహటికి తీసుకెళ్లనున్నారు. జిగ్నేష్ అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల మద్దతుదారులు గురువారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ‘‘రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి’’ అనే నినాదాలతో నిరసన తెలిపారు.ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్ మేవానీ అరెస్ట్ కావడం గమనార్హం.

Updated Date - 2022-04-21T14:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising