ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో తీవ్ర వేడిగాలులు...ఐఎండీ yellow alert జారీ

ABN, First Publish Date - 2022-03-17T12:35:58+05:30

గుజరాత్‌ రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది.గుజరాత్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడిగాలులు వీస్తుండటంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.20 ఏళ్లలో తొలిసారిగా మార్చి 15వతేదీ నాటికి అహ్మదాబాద్‌లో రికార్డు స్థాయిలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.గుజరాత్‌లో వేసవి కాలం ప్రారంభం కాగానే ఎండ వేడిమిలో రికార్డులన్నీ బద్దలయ్యాయి. వేడిగాలుల కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గుజరాత్‌లోని 10 నగరాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది.20 ఏళ్లలో తొలిసారిగా మార్చి 15వ నాటికి అహ్మదాబాద్‌లో రికార్డు స్థాయిలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.


 సురేంద్రనగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.రాబోయే కొద్ది రోజుల్లో గుజరాత్‌లో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని గుజరాత్ వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమ మొహంతి తెలిపారు.‘‘గుజరాత్‌లో హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేశాం. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రానున్న 24 గంటలపాటు, ఉత్తర గుజరాత్‌లో 48 గంటలపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత హీట్ వేవ్ తగ్గుతుంది కానీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది’’ అని అహ్మదాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


Updated Date - 2022-03-17T12:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising