ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Police : మాదక ద్రవ్యాల కేసులో నలుగురి అరెస్ట్... నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడు...

ABN, First Publish Date - 2022-07-29T01:20:22+05:30

చట్ట వ్యతిరేకంగా ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను కలిగియున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : చట్ట వ్యతిరేకంగా ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను కలిగియున్న నలుగురిని గుజరాత్ పోలీసు (Gujarat Police) స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బృందం అరెస్టు చేసింది. దీని విలువ దాదాపు రూ.1.96 లక్షలు ఉంటుంది. నిందితుల్లో ఒకరు రాజ్‌కోట్ (Rajkot) తాలూకా బీజేపీ (BJP) కమిటీ కార్యదర్శి కుమారుడు. 


SOG ఇన్‌స్పెక్టర్ జీఎన్ పర్మార్ తెలిపిన వివరాల ప్రకారం, మలతాజ్-దభోయి రోడ్డుపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురి వద్ద చట్టవిరుద్ధంగా ఎండీఎంఏ డ్రగ్స్ (MDMA Drugs) ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ బరువు 19.680 గ్రాములు. మార్కెట్లో దీని విలువ రూ.1.96 లక్షలు. ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, రోహన్ రయ్యానీ, తుషార్ సంగానీ, రోహన్ వసోయా, మోహిత్ పర్సానాలను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి సంపాదించారు? ఎవరి కోసం తీసుకెళ్తున్నారు? వ్యక్తిగతంగా వినియోగించడానికా? ఇతరులకు సరఫరా చేయడానికా? అనే అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. 


రోహన్ రయ్యానీ తండ్రి సురేశ్ రయ్యానీ గుజరాత్‌లోని రాజ్‌కోట్ తాలూకా బీజేపీ కమిటీ కార్యదర్శి, గుండా గ్రామ సర్పంచ్. 


నాటుసారాతో పట్టుబడ్డ మరో బీజేపీ నేత తల్లి

కర్జన్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శైలేష్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం, డెల్వాడా గ్రామంలో నిర్వహించిన సోదాల్లో ముగ్గురు మహిళల నుంచి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరి కుమారుడు బీజేపీ నేత జిగ్నేష్ వసవ. ఆమె వద్ద నుంచి 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అనేకసార్లు నాటు సారా కేసుల్లో అరెస్టు చేశారు. 


Updated Date - 2022-07-29T01:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising