ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాండ్‌ మాస్టర్‌ Bharathకు రూ.8లక్షల కానుక

ABN, First Publish Date - 2022-01-21T13:42:10+05:30

పధ్నాలుగేళ్లలోపే చదరంగంలో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి, గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న రాష్ట్ర చదరంగపు క్రీడాకారుడు భరత్‌ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి ఎంకే సాట్లఇన్‌ రూ.8లక్షల నగదు కానుక అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పధ్నాలుగేళ్లలోపే చదరంగంలో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి, గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న రాష్ట్ర చదరంగపు క్రీడాకారుడు భరత్‌ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి ఎంకే సాట్లఇన్‌ రూ.8లక్షల నగదు కానుక అందజేశారు. సచివాలయంలో గురువారం ఉదయం భరత్‌, అతడి తల్లిదండ్రులు స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఆ సందర్భంగా  అంతర్జాతీయ చదరంగ పోటీల్లో పాల్గొని గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను గెలుచుకున్న విధానం గురించి స్టాలిన్‌ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 2019లో ఇంటర్‌నేషనల్‌ చెస్‌మాస్టర్‌ టైటిల్‌  గెలుచుకున్నందుకు రూ.3 లక్షలు, 2022లో గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను గెలుచుకున్నందుకు రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.8లక్షల చెక్కును భరత్‌ సుబ్రమణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీవీ మెయ్యనాధన్‌, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అపూర్వ, భరత్‌ కోచ్‌ శ్యామ్‌ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T13:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising