ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విద్యార్థిని సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2022-03-09T14:19:20+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని కళ్లకు గంతలు కట్టుకొని 2 నిమిషాల్లో 106 టెంకాయలు పగులగొట్టి రికార్డు సృష్టించింది. తిరువణ్ణామలై జిల్లా ఆరణి మునుకపట్టు గ్రామానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని కళ్లకు గంతలు కట్టుకొని 2 నిమిషాల్లో 106 టెంకాయలు పగులగొట్టి రికార్డు సృష్టించింది. తిరువణ్ణామలై జిల్లా ఆరణి మునుకపట్టు గ్రామానికి చెందిన కుమారన్‌-అనిత దంపతులకు శృతి (13), కాంచన (10) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. శృతి అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించాలని శృతి నిర్ణయించింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై సోదరి కాంచనను పడుకో బెట్టి, ఆమె చుట్టూ టెంకాయలు ఉంచింది. అనంతరం కళ్లకు గంతలు కట్టుకొని 2 నిమిషాల వ్యవధిలో 106 టెంయాలను సుత్తితో పగులగొట్టి రికార్డు నెలకొల్పింది. శృతి రికార్డును ఫినిక్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో నమోదుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శృతి గతంలో కళ్లకు గంతలు కట్టుకొని నిమిషంలో 50 టెంకాయలు పగులగొట్టిన రికార్డు కూడా అధికమించింది. కాగా, రెండేళ్ల కిత్రం శృతి కళ్లకు గంతలు కట్టుకొని సుమారు 36 కి.మీ సైకిల్‌ తొక్కి కలాం ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటు చేసుకోవడం గమనార్హం.

Updated Date - 2022-03-09T14:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising