ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాస్పత్రుల్లో బూస్టర్‌ డోస్‌

ABN, First Publish Date - 2022-04-12T15:47:49+05:30

కేంద్రప్రభుత్వ విధివిధానాలు అనుసరించి ప్రభుత్వాసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ టీకాను త్వరలో వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - మంత్రి సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): కేంద్రప్రభుత్వ విధివిధానాలు అనుసరించి ప్రభుత్వాసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ టీకాను త్వరలో వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. అన్నాశాలైలోని ఓమందూర్‌ ఎస్టేట్‌ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రభుత్వం గుర్తించిన పాత్రికేయులకు వైద్య బీమా గుర్తింపుకార్డు ల పంపిణి ప్రత్యేక శిబిరాన్ని సోమవారం మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. రానున్న రెండు వారాల వరకు ఈ శిబిరం కొనసాగుతుందని మంత్రి  తెలిపారు. సీఎం వైద్య బీమా పథకం కింద 1414 మంది పాత్రికేయులు లబ్దిపొందనున్నారని, రూ.10,703 కోట్లతో ఇప్పటివరకు 1.9 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని మంత్రి వివరించారు. హైటెక్‌ వసతులతో రూ.35 కోట్లతో ఈ ఆస్పత్రిలో సీఎం స్టాలిన్‌ ప్రారంభించిన రోబోటెక్‌ చికిత్సా కేంద్రం ద్వారా తిరుపత్తూర్‌ జిల్లాకు చెందిన కృష్ణన్‌ మూత్రపిండాల సమస్యకు అందించిన చికిత్సలతో ఆరోగ్యంగా కోలుకున్నాడని తెలిపారు. సీఎం వైద్య బీమా పథకంపై నిర్లక్ష్యం చూపే ప్రైవేటు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, 104 టోల్‌ ఫ్రీ నెంబరుకు 24 గంటలు ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. చైనా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాలు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకోలేదని, అయితే రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2022-04-12T15:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising