ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి కంటెంట్ వద్దు.. ఎఫ్ఎమ్ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

ABN, First Publish Date - 2022-03-01T20:07:06+05:30

ఎఫ్ఎమ్ రేడియో ఛానెళ్లలో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసిన ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్ఎమ్ రేడియో ఛానెళ్లలో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసిన ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి కంటెంట్ ప్రసారం చేయడం గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్ (జీఓపీఏ) నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని సూచించింది. ఎఫ్ఎమ్ ఛానెళ్లలో అసభ్యకర కంటెంట్ ఎక్కువవుతోందనే అంశం కేంద్రం దృష్టికి రావడంతో, తాజాగా ఈ సూచనలు చేసింది. ‘‘చాలా ఎఫ్ఎమ్ ఛానెళ్లు అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేస్తున్నాయి. రేడియో జాకీలు వాడే భాష కూడా సరిగ్గా ఉండటం లేదు. అవమానకర, పరువుకునష్టం కలిగించే పదాలను వాడుతున్నారు. ఇలాంటివి మంచివి కాదు. అందుకే దీనిపై చర్యలు తీసుకుంటున్నాం. తాజా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఎఫ్ఎమ్ ఛానెల్ కచ్చితంగా నిబంధనలు పాటించాలి’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-03-01T20:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising