ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజనీకాంత్‌కుగవర్నర్‌ పదవి?

ABN, First Publish Date - 2022-08-18T09:15:32+05:30

తమిళనాట పునాదులు పటిష్ఠం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ ఆఫర్‌కు నటుడి సానుకూలత!
  • అభిమానుల ఓట్లపై కాషాయదళం గురి
  • తమిళనాట పాగా వేసేందుకు సన్నాహాలు


చెన్నై, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తమిళనాట పునాదులు పటిష్ఠం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఇందుకోసం ఆయనకు గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీకాంత్‌, ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 75వ  స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న రజనీ.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి తెలిసింది. 


గతంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీకాంత్‌, ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 75వ  స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న రజనీ.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన మరునాడే తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ కావడంతో పాటు, ఆయనతో రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌తో రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు రజనీపై దుమ్మెత్తిపోశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి గణనీయ స్థానాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహం రచించిన బీజేపీ.. ఆ మేరకు రజనీని రంగంలోకి దింపుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే రజనీకి గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. మోదీతో రజనీకి చిరకాల స్నేహం ఉంది.


 గతంలో మోదీ చెన్నై వచ్చినప్పుడు రజనీ నివాసానికి వెళ్లి చాలాసేపు ఆ కుటుంబంతో సరదాగా గడిపారు. ఈ సాన్నిహిత్యం కూడా రజనీని బీజేపీకి చేరువ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి వచ్చిన ‘ఆఫర్‌’కు రజనీ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.  తమ పార్టీలో చేరాలన్న బీజేపీ నేతల వినతికి విముఖత కనబరచిన రజనీ.. గవర్నర్‌ గిరీకి మాత్రం అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గవర్నర్‌ పదవి అయితే ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరముండదు కనుక ఆయన ఓకే చెప్పినట్లు తెలిసింది. రజనీ తమ పార్టీలో చేరకపోయినా గవర్నర్‌ పదవి ద్వారా ఆయన్ని తమ సొంతం చేసుకుంటే, ఆయన అభిమానులు తమ పార్టీ వెన్నంటి ఉంటారని బీజేపీ నేతలు గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ని గవర్నర్‌గా నియమించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-08-18T09:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising