ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

high courts judges: 37 మంది హైకోర్టు జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం

ABN, First Publish Date - 2022-08-16T16:41:39+05:30

దేశంలోని వివిధ హైకోర్టుల్లో 37 మంది హైకోర్టు జడ్జీల(high courts judges) నియామకానికి సుప్రీంకోర్టు కొలిజియం(Supreme Court Collegium) సిఫారసు(recommended) చేసింది. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 37 మంది హైకోర్టు జడ్జీల(high courts judges) నియామకానికి సుప్రీంకోర్టు కొలిజియం(Supreme Court Collegium) సిఫారసు(recommended) చేసింది. సుప్రీంకోర్టు సిఫారసు చేసిన హైకోర్టు జడ్జీల పేర్లకు కేంద్ర ప్రభుత్వం((Government approves) ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణలతో కూడిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో అత్యధికంగా 11 మంది జడ్జీలను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ( Law Ministry) మంగళవారం నోటిఫికేషన్(notification issued) జారీ చేసింది.


 హైకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం

జస్టిస్ నిధి గుప్తా, సంజయ్ వశిష్ట, త్రిభువన్ దాహియా, నమిత్ కుమార్, హరకేష్ మంజూ, అమన్ చౌదరి, నరేష్ సింగ్, హర్ష్ బుంగార్, జగ్ మోహన్ బన్సాల్, దీపక్ మంచండ, అలోక్ జైన్ లు హైకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన 26 మంది జడ్జీలను అలహాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గౌహతి హైకోర్టుల్లో నియమించారు.ఈ ఏడాది సుప్రీం కొలిజియం సిఫారసు చేసిన 138 మంది జడ్జీలను కేంద్రం నియమించింది. గత సంవత్సరం కొవిడ్ పరిస్థితుల్లోనూ కేంద్రం 120మంది హైకోర్టు జడ్జీలను నియమించింది.2016లో 126 మంది హైకోర్టు జడ్జీలను కేంద్రం నియమించింది. 



హైకోర్టుల్లో పెండింగ్ కేసులు

దేశంలోని హైకోర్టుల్లో జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండటంతో 59 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ నూతనంగా నియమితులైన ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నగేశ్‌ భీమపాక, పుల్ల కార్తీక్‌, కాజ శరత్‌ శాశ్వత న్యాయమూర్తులుగా..  జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2022-08-16T16:41:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising