ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇష్టానుసారంగా దుస్తులు వేసుకోవడం సరికాదు’

ABN, First Publish Date - 2022-03-12T15:38:08+05:30

విద్యాభ్యాసం, సాధికారిత, జీవనం తదితర అంశాలు హక్కు కానీ, ఇష్టానుసారంగా దుస్తులు ధరించడం మహిళ హక్కు కాదని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ వ్యాఖ్యానించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇంపైన వస్త్రధారణ.. ఇంతులకు అలంకరణ

- పుదువై గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై


అడయార్‌(చెన్నై): విద్యాభ్యాసం, సాధికారిత, జీవనం తదితర అంశాలు హక్కు కానీ, ఇష్టానుసారంగా దుస్తులు ధరించడం మహిళ హక్కు కాదని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ వ్యాఖ్యానించారు. నుంగంబాక్కంలోని శాస్త్రి భవన్‌లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సును తమిళిసై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 8వ తేది మాత్రమే కాక ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని పేర్కొన్నారు. ఇష్టానుసారం దుస్తులు ధరించడం మహిళల హక్కు అని కొంతమంది భావిస్తున్నారని, మనకు ఎలాంటి హక్కులున్నాయో, అవే మన చుట్టూ ఉన్నవారికి కూడా ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. మహిళల వస్త్రధారణలో కట్టుబాట్లు ఉండాలన్నా రు. మహిళలకు మాత్రమే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని, పురుషులకు కూడా కట్టుబాట్లు ఉంటేనే మహిళలతో సమానంగా ఉంటారన్నారు. ఆధునిక వస్త్రధారణలో జాగ్రత్త వహించాలన్నారు. వస్తధారణలో కొన్ని కట్టుబాట్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీనియర్‌ నటి కుట్టి పద్మిని, సమాచార ప్రసార శాఖ కార్యాలయ అధికారి గురుబాబు, రచయిత్రి గీతా ఇళంగోవన్‌ తదితరులు కూడాపాల్గొన్నారు.

Updated Date - 2022-03-12T15:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising