ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో స్పీకర్‌ భేటీ

ABN, First Publish Date - 2022-01-04T13:46:13+05:30

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయ్యారు. సోమవారం ఉదయం డిప్యూటీ స్పీకర్‌ కె.పిచ్చాండితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ నెల 5వ తేదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానం


చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయ్యారు. సోమవారం ఉదయం డిప్యూటీ స్పీకర్‌ కె.పిచ్చాండితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభం కానున్న ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆహ్వానించారు. అదే విధంగా సమా వేశాలను జార్జ్‌కోటలో కాకుండా చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలో నిర్వహించడానికి గల కారణాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. అంతేగాక సమావేశాలకు సంబంధించిన ప్రణాళికను, భద్రతా ఏర్పాట్ల గురించి కూడా స్పీకర్‌ తెలిపారు. ఇదిలా వుండగా ఈ నెల 5వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు పూర్తవ్వడంతో స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టబోయే చర్యల పట్ల అన్ని వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గవర్నర్‌ ప్రసంగంలో డీఎంకే ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టబోయే పథకాలు, ప్రణాళికలకు సంబంధించిన వివరాలు వుంటాయని అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2022-01-04T13:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising