ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2022-03-05T02:20:05+05:30

అయితే దీనిపై ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. ఉక్రెయిన్ విద్యార్థులకు స్వదేశంలోని కాలేజీల్లోనే కోర్స్ పూర్తి చేసే అవకాశం కల్పించడమా లేదంటే వేరే దేశాల్లో ప్రవేశానికి అవకాశం కల్పించడమా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అనేక మంది విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ చదువు మధ్యలో ఆగిపోయిందనే ఆందోళన చాలా మంది విద్యార్థుల్లో నెలకొంది. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేయనుంది. జాతీయ మెడికల్ కమిషన్-2021 నిబంధనల ప్రకారం విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు మిగిలిన చదువును ఇక్కడే పూర్తి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నారట. నిజానికి ప్రాథమిక వైద్యవిద్య ప్రారంభమైనచోటే కోర్స్ మొత్తం పూర్తి చేయాలి. కానీ ప్రత్యేక కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధన తీసుకురానున్నట్లు, దీని కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


అయితే దీనిపై ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. ఉక్రెయిన్ విద్యార్థులకు స్వదేశంలోని కాలేజీల్లోనే కోర్స్ పూర్తి చేసే అవకాశం కల్పించడమా లేదంటే వేరే దేశాల్లో ప్రవేశానికి అవకాశం కల్పించడమా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ మెడికల్ కమిషన్ మధ్య చర్చ జరుగుతోందట. సాధ్యాసాధ్యాలపై చర్చించి తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Updated Date - 2022-03-05T02:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising