ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవా ఎన్నికల ప్రచారానికి సిద్దరామయ్య

ABN, First Publish Date - 2022-02-08T17:15:51+05:30

గోవా శాసనసభ ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెళ్లనున్నారు. గోవాలో రెండు రోజులపాటు వివిధ ప్రాం తాలలో ఆయన ప్రచారం చేస్తారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచన మేరకు మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన ప్రచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: గోవా శాసనసభ ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెళ్లనున్నారు. గోవాలో రెండు రోజులపాటు వివిధ ప్రాం తాలలో ఆయన ప్రచారం చేస్తారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచన మేరకు మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరంగావ్‌, వాస్కో, దాబోలిన్‌, కార్తలిమ్‌ ప్రాంతాలలో మంగళవారం ప్రచారసభలలో పా ల్గొంటారు. బుధవారం ఎన్నికల పరిశీలకుల సభలో పాల్గొని సమీక్ష జరుపుతారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోవాలో ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌లలో సిద్దరామయ్య కూడా ఉన్నారు. మాజీ మంత్రులు హెచ్‌కే పాటిల్‌, ఎంబీ పాటిల్‌, ఆర్‌వీ దేశ్‌పాండే, సతీశ్‌ జార్కిహొళి, బీవీ శ్రీనివాస్‌ గోవాలో ప్రచారానికి వెళ్లనున్నారు. ఈనెల 14న గోవాలోని 40 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 301 మంది అభ్యర్థులు ఉండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. గోవా ఎన్నికలపై జరిగిన సమీక్షలో కాంగ్రెస్‌కు 17-20 స్థానాలు సాధ్యమవుతాయని ప్రకటించాయి. గోవా రాష్ట్రానికి పొరుగున ఉండే కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నమేరకు వీరి ద్వారా ప్రచారం జరిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. 

Updated Date - 2022-02-08T17:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising