ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bra తీసేసి ‘నీట్’ ఎగ్జామ్ రాయమన్న అధికారులు.. కారణం ఇదే!

ABN, First Publish Date - 2022-07-19T02:54:17+05:30

కేరళలో నీట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లాం: కేరళలో నీట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఎగ్జామ్ రాసేందుకు బ్రా (Bra) తొలగించాల్సిందేనని చెప్పడంతో మరోదారి లేక అలాగే చేయాల్సి వచ్చింది. ఓ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొల్లాం (Kollam)లోని నీట్ కేంద్రంలో జరిగిందీ ఘటన.


బ్రాకు ఉన్న మెటల్ హుక్స్ కారణంగా తనిఖీ సమయంలో ‘బీప్’ సౌండ్ వచ్చింది. దీంతో బ్రా తీసి ఎగ్జామ్ హాలులోకి వెళ్లాలని, లేదంటే పరీక్షకు అనుమతించబోమని చెప్పడంతో ఎగ్జామ్‌ను వదులుకోలేని తన కుమార్తె ఇన్నర్‌వేర్‌ను తొలగించి ఎగ్జామ్ రాయాల్సి వచ్చిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘భవిష్యత్  కంటే ఇన్నర్‌వేరే ముఖ్యమా? సమయం వృథా చేయకుండా వెంటనే తీసి ఎగ్జామ్ హాలులోకి వెళ్లు’’ అని బలవంతంగా లోదుస్తులు తొలగించినట్టు ఆయన ఆ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశాడు. 


మార్తోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగిందీ ఘటన. అయితే, అందుకు తాము బాధ్యత వహించలేమని కాలేజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. కాగా, ఇన్నర్‌వేర్ తొలగించిన ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. తమ కుమార్తే కాదని, చాలామంది అమ్మాయిలు లోదుస్తులు తొలగించి స్టోర్‌రూములో పడేశారని ఆరోపించారు. 


‘‘సెక్యూరిటీ చెక్‌లో బీప్ సౌండ్ రావడంతో అది తన లోదుస్తులకు ఉన్న మెటల్ హుక్ అని నా కుమార్తె చెప్పింది. దీంతో దానిని తీసేయాల్సిందేనని వారు బలవంతం చేశారు. దాదాపు 90 శాతం మంది విద్యార్థినులు తమ లోదుస్తులను తొలగించి స్టోర్‌రూములో ఉంచాల్సి వచ్చింది. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు’’ అని ఆ బాలిక తండ్రి పేర్కొన్నారు.


గది నిండా లోదుస్తులు ఉండడాన్ని తన కుమార్తె చూసిందని, చాలామంది అమ్మాయిలు దుఃఖాన్ని ఆపులేక ఏడ్చేశారని, మానసికంగా చిత్రవధ అనుభవించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, మరికొంతమంది అమ్మాయిలు వారి లోదుస్తులకున్న హుక్స్‌ను కట్ చేసి ముడివేసుకున్నారని, వారు మానసికంగా ఇబ్బందిపడడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారని పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-07-19T02:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising