ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ముక్త యూపీతోనే గ్రేటర్ ఆజాదీ : మెహబూబా ముఫ్తీ

ABN, First Publish Date - 2022-01-18T01:49:32+05:30

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 కంటే అతిపెద్ద స్వాతంత్ర్యం బీజేపీ ముక్త యూపీతోనే వస్తుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 కంటే అతిపెద్ద స్వాతంత్ర్యం బీజేపీ ముక్త యూపీతోనే వస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీ అన్నారు. దేశాన్ని విభజించాలని వాళ్లు (బీజేపీ) కోరుకుంటున్నందునే ఆ పార్టీని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. అప్పుడే దేశానికి 1947కు మించిన అదిపెద్ద స్వాంతంత్ర్యం వచ్చినట్టని పేర్కొన్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన పీడీపీ గిరిజన యవజన సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అందువల్లే వారు ఔరంగజేబ్, బాబర్ పేర్లు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. బీజేపీని వదలించుకునే అవకాశం ఈరోజు వచ్చిందని పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ అభివృద్ధి జరిగిందే చెప్పాలని బీజేపీని మెహబూబా ముఫ్తీ నిలదీశారు. ''ఉద్యోగాలు, భూములు బయట వాళ్లకు ఇస్తున్నారు. ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని చెబుతున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని నేను అడుగుతున్నాను. యూపీలో ఆసుపత్రులు బీజేపీ ఏర్పాటు చేసినవి కావు'' అని ఆమె అన్నారు. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎడు విడతల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7వ తేదీతో ముగుస్తాయి. మార్చిన 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-18T01:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising